: బాలనాగిరెడ్డి సొంతూరులో టీడీపీ ప్రచారంతో ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి సొంతూరులో టీడీపీ ప్రచారం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లా రామాపురంలో టీడీపీ ప్రచారం నిర్వహించింది. గ్రామస్థులంతా రోడ్డుపైకి వచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు భారీ బందోబస్తు కల్పించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.