: కాంగ్రెస్ కు అంబటి రాంబాబు సవాల్


సహకార ఎన్నికల్లో గెలిచానని చెప్పుకుంటున్నకాంగ్రెస్  పార్టీ, దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు పీసీసీ చీఫ్ బొత్స చెబుతున్నారనీ, మరి ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో ప్రభుత్వానికి మెజార్టీ ఉందా? అని అంబటి ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండు చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇంతకంటే మంచి సమయం దొరకదని అంబటి సూచించారు.

  • Loading...

More Telugu News