: 'రామ్ లీలా' చిత్ర యూనిట్ కు అరెస్టు వారెంట్
కొన్ని నెలల కిందట విడుదలై విజయవంతమైన బాలీవుడ్ చిత్రం 'రామ్ లీలా' ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరోయిన్లు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్, నిర్మాత కిషోర్ లుల్లా, సంగీత దర్శకులు, పాటల రచయితలకు యూపీలోని ముజఫర్ పూర్ లోని కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మత భావాలను బాధ పెట్టే విధంగా ఉన్నాయంటూ గతేడాది నవంబర్ లో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్ పీ. సింగ్... వారిని అరెస్టు చేసి, జూన్ 4న కోర్టుకు హాజరుపర్చాలంటూ ముంబయి పోలీసు కమిషనర్ ను ఆదేశించారు.