: దూరదర్శన్ స్వతంత్రతను కోల్పోయింది: సికార్
దూరదర్శన్ తన స్వతంత్రతను కోల్పోయిందని ప్రసారభారతి సీఈవో జవహర్ సికార్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దూరదర్శన్ అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ప్రవర్తించడం వల్ల ప్రజల్లో తమ విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దూరదర్శన్ కు స్వయంప్రతిపత్తిని కల్పించడంలో అలసత్వం చూపిస్తుందని ఆయన ప్రసార భారతి బోర్డుకు లేఖ రాశారు. మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూను సెన్సార్ చేశారని వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ రకంగా స్పందించారు.