: బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త!


మూత్రాన్ని ఆపుకోలేక రోడ్డు పక్కనే హాయిగా పని కానిచ్చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఆ ఇంతే చెబుతారులే... అని పట్టించుకోకుండా అదే పని చేసేస్తుంటే... మీ వెనుకే ఓ పెద్ద వాటర్ టాంకర్ వచ్చి ఆగుతుంది. ముసుగు ధరించిన వ్యక్తి బలమైన ఫోర్స్ తో మీపైకి నీటిని పంప్ చేస్తాడు. ఆ ధాటికి మీరు తడిసి ముద్దవుతారు. పంప్ చేసే నీటి ఒత్తిడికి కిందపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వీడియో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.

కావాలంటే ఈ వీడియోను ఒకసారి చూడండి. ఆపై బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేయాలంటే వణుకు పుడుతుంది. కొంత మంది యువకులు 'ద క్లీన్ ఇండియా' పేరుతో ఈ వీడియోను రూపొందించారు. 'ద పిస్సింగ్ ట్యాంకర్' పేరుతో ఒక నీటి ట్యాంకర్ వేసుకుని నగరంలో తిరుగుతూ బహిరంగంగా మూత్ర విసర్జన చేసేవారిపై నీటితో ఓ దాడి చేస్తుంటుంది. వీరి నినాదం 'మీరు ఆపితే మేము ఆపుతాం'. దీనిని తమాషాగా, ఆలోచనాత్మకంగా చిత్రీకరించారు. ఈ వీడియోను చూస్తే ఇక ఎవరూ బహిరంగ మూత్ర విసర్జన చేయరు. ఇప్పటికే 1,80,000 మంది దీనిని చూసేశారు. ఎన్నో కామెంట్స్ కూడా వచ్చేశాయి. పరిశుభ్ర దేశం కోసం ఆలోచింపజేయడమే వీరి ఉద్దేశం.

  • Loading...

More Telugu News