: టీడీపీ-బీజేపీ కూటమికి మంద కృష్ణ మద్దతు
టీడీపీ-బీజేపీ కూటమికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ-బీజేపీ చిత్తశుద్ధితో సహకరిస్తున్నాయని చెప్పారు. కానీ, వర్గీకరణ జరగకూడదని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ తో వైసీపీ కుమ్మక్కైందని, అందుకే సీమాంధ్రలో వైఎస్సార్సీపీని ఓడించాలని మాదిగ కులస్తులకు పిలుపునిస్తున్నామన్నారు.