: ఇంట గెలవకపోయినా.. రచ్చ గెలిచిన 'బర్ఫీ'


రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా నటించిన 'బర్ఫీ' చిత్రం భారత వేదికలపై నిరాశ పరిచినా.. ప్రపంచ స్థాయిలో మాత్రం ప్రతిష్ఠాత్మక అవార్డు కొల్లగొట్టేసింది. జాతీయ అవార్డుల సందర్భంగా 'బర్ఫీ' చిత్ర బృందానికి నిరాశ ఎదురైనా, జపాన్ చిత్రోత్సవంలో జయభేరి మోగించింది. గతవారం జరిగిన అకినావా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'బర్ఫీ' ఉత్తమ చిత్రరాజంగా గ్రాండ్ జ్యూరీ అవార్డు ఎగరేసుకెళ్ళింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది 4 ఆస్కార్ నామినేషన్లు పొందడంతోపాటు, కేన్స్ చిత్రోత్సవంలో 3 అవార్డులను కైవసం చేసుకున్న హాలీవుడ్ చిత్రం 'బీస్ట్స్ ఆఫ్ సదరన్ వైల్డ్' చిత్రాన్ని వెనక్కినెట్టి మరీ 'బర్ఫీ' గ్రాండ్ అవార్డు దక్కించుకుంది. దీంతో, చిత్ర దర్శకుడు అనురాగ్ బసు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ అవార్డుతో బర్ఫీ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిందన్నాడు. ఈ గౌరవం తనకొక్కడికే కాదని, దేశం మొత్తానికి చెందుతుందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News