: పరిటాల శ్రీరామ్ కు బెయిల్ మంజూరు
పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు బెయిల్ ఇచ్చింది. కొన్ని రోజుల కిందటి ఘర్షణ కేసులో నిన్న (శుక్రవారం) కనగానపల్లెలో శ్రీరామ్ పోలీసులకు స్వయంగా లొంగిపోవడంతో కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.