: కృష్ణాజిల్లా నందిగామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోత్కుపల్లి
కృష్ణాజిల్లా నందిగామ మండలంలో చేపట్టిన పార్టీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక నేరగాడు జగన్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇంకా సంపాదించడానికే ఆయన సీఎం కావాలనుకుంటున్నారని విమర్శించారు. జగన్ దోషిగా నిరూపణ కావడం, జైలుకు వెళ్లడం ఖాయమని మోత్కుపల్లి చెప్పారు.