: ఢిల్లీ- కోల్ కతా ప్రయాణికులకు ఇంటర్నెట్ సౌకర్యం


'ఢిల్లీ-కోల్ కతా' రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు ఇకనుంచి 'వైఫై' (వైర్ లెస్ ఫెడిలిటి) ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఆ శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ట్రైన్ లో లాంఛనంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించారని రైల్వే అధికారులు తెలిపారు.

దీని ద్వారా ప్రయాణికులు ట్రైన్ లో ఇంటర్ నెట్ సౌకర్యాన్నిపొందవచ్చని చెప్పారు. ప్రయాణికుల టికెట్ వివరాల ఆధారంగా, వారు ప్రయాణించే సమయాన్ని బట్టి  పాస్ వర్డ్ ఇవ్వబడుతుందన్నారు. ఇదిలావుంటే, ఈ సౌకర్యాన్ని త్వరలో శతాబ్ది, దురంతో రైళ్ళలోనూ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News