: మోడీ ప్రభుత్వంలో భాగం కాను: రాజ్ నాథ్ సింగ్


ఎన్నికల అనంతరం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే అందులో తాను భాగస్వామిని కానని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 'నేను బీజేపీ అధ్యక్షుడిని. నా బాధ్యతలు నాకున్నాయి. అధ్యక్షుడిగా ఉండని సమయంలో ప్రభుత్వంలో ఉన్నా. నా సహచరులు సమర్థులైన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వంలో అవకాశం రావాలి' అని రాజ్ నాథ్ ఓ జాతీయ చానల్ తో చెప్పారు. ప్రధాని కావడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బీజేపీలో మోడీకే అధికారం ఉందని స్పష్టం చేశారు. మోడీ తప్పకుండా భారతదేశ ప్రధాని అవుతారన్నారు.

  • Loading...

More Telugu News