: అసోం మారణహోమంలో 32కు చేరిన మృతుల సంఖ్య


అసోంలో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఉగ్రవాదులు జరిపిన హింసాకాండలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి తర్వాత ఉగ్రవాదులు అమాయక పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ బలగాలు రంగ ప్రవేశం చేశాయి. కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. బోడోలాండ్ ప్రాదేశిక మండలి పరిధిలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News