: ఎవరొచ్చినా పోలవరాన్ని అడ్డుకోలేరు: జైరాం రమేశ్
పోలవరం నిర్మాణంపై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ధీమాతో ఉన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరాన్ని అడ్డుకోలేరన్నారు. అనంతపురంలో ఈ మేరకు మీడియాతో జైరాం మాట్లాడుతూ, జైలు నుంచి బెయిల్ పై వచ్చిన జగన్ ను ప్రజలు సీఎం చేయరన్నారు. వైసీపీ ఓ నకిలీ కాంగ్రెస్ అని ప్రజలు దానిని విశ్వసించరని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ తో పాటు సీమాంధ్ర భారీగా నష్టపోయిందని ఆరోపించారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లే కాంగ్రెస్ ను వదిలి వెళ్లారని ఆయన విమర్శించారు.