: గుంటూరులో ఖాళీ కుర్చీలకు సోనియా ఉపన్యాసం చేశారు: వెంకయ్యనాయుడు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిన్న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చేశారని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దిగిపోయే ముందు హోం మంత్రి షిండేకి, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై విచారణకు ఆదేశించే అధికారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటని అన్నారు.