: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన ముగించుకుని ఉదయం 11 గంటలకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట బహిరంగసభలో పాల్గొని ఉపన్యసిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా చేరుకుని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన 3 గంటల పాటు కొనసాగుతుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్డీఏ అభ్యర్ధులకు మద్దతుగా ఈ రోజు కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తారు. విశాఖ నగరంతో పాటు శ్రీకాకుళం టెక్కలిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. విజయనగరం కోటకూడలిలో నిర్వహిస్తున్న సభలో పాల్గొని ఉపన్యసిస్తారు.