: సీమాంధ్రకు కడపను రాజధానిగా సిఫార్సు చేస్తాం: జైరాం రమేష్
కడపలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సీమాంధ్రకు కడపను రాజధానిగా చేయాలని ఒక నివేదిక తయారుచేసి పంపుతామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. కడప జిల్లా బద్వేలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసి వైఎస్సార్సీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తెలుగు గంగ, హంద్రినీవా, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. ఇందుకోసం 11,000 కోట్ల ప్యాకేజీ ఇస్తామని, తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధికి సహకరిస్తామని జైరాం రమేష్ తెలిపారు.