: మీరిచ్చిన స్థానం ముందు ముఖ్యమంత్రి పదవి ఎక్కువా? : పవన్ కల్యాణ్
అభిమానులు తమ గుండెల్లో ఇచ్చిన స్థానం ముందు సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి ఎక్కువా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో తనకు చాలా మంది సలహా ఇచ్చారని, అయినా సరే తాను ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఉద్యమం సమయంలో ప్రజల్లోకి రాలేదని తెలిపారు. పార్లమెంటు సాక్షిగా సీమాంధ్ర ఎంపీలపై దాడి జరుగుతుంటే కడుపు రగిలిపోయిందని పవన్ కల్యాణ్ తెలిపారు.
తనపై విపరీత వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నానని ఆయన తెలిపారు. పౌరుషం, తెగువ, తెగింపు ఉన్నది కేవలం కేసీఆర్ కుటుంబానికేనా? సాధారణ పౌరులకు పౌరుషం, తెగువ, తెగింపు ఉండవా? అని ఆయన ప్రశ్నించారు. దేశం, ప్రజలు, సమాజం తనకు ముఖ్యమని పవన్ కల్యాణ్ తెలిపారు.