: జేడీ శీలంను ఆపమన్న సోనియా గాంధీ
గుంటూరు సోనియా గాంధీ బహిరంగ సభలో భలే విశేషాలు చోటు చేసుకున్నాయి. సోనియా సభలో కుర్చీలు నిండకపోగా, సోనియా మాట్లాడుతుండగా సభికులు లేచి వెళ్లిపోవడం జరిగింది. సోనియా గాంధీ ప్రసంగానికి అనువాదకుడిగా ఉన్న కేంద్ర మంత్రి జేడీ శీలం సోనియా చెప్పిన ఒకటి రెండు వ్యాఖ్యలకు ప్రసంగ పాఠం చెబుతుండడంతో ఆమె జేడీ శీలంను ఒకట్రెండు సార్లు ఇక ఆపమంటూ ఆర్డర్ వేశారు. దీంతో ఆయన తన వాగ్ధాటికి బ్రేకులు వేసుకున్నారు.