: తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే నగరం గుంటూరు: సోనియాగాంధీ
రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తొలిసారి అడుగుపెట్టిన అధినేత్రి సోనియాగాంధీ గుంటూరులో నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన సోనియా... గుంటూరుకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే నగరం గుంటూరు అని అభివర్ణించిన సోనియా, మీ అందరి మనోభావాలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని, చాలా ఆలోచించిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.