: హిందూపురంలో సొంత మేనిఫెస్టో విడుదల చేసిన బాలకృష్ణ
హిందూపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా, హిందూపురం నియోజకవర్గానికి తనదైన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. తాగునీటి సమస్యను సమూలంగా పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని మేనిఫెస్టోలో బాలయ్య పేర్కొన్నారు. హిందూపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పారు. హైటెక్ సిటీ తరహాలో హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు.