: నేను ఓడిపోవడం ఖాయం... నా గెలుపుపై ఎవరూ బెట్టింగులు కాయకండి: కాంగ్రెస్ అభ్యర్థి
గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ మాదమ్ ఎన్నికలు ఇంకా పూర్తి కాకముందే తన ఓటమిని అంగీకరించారు. ఆయన పోటీ చేసిన జామ్ నగర్ లోక్ సభ స్థానంలో (ఏడో విడత ఎన్నికల్లో) మొత్తం 57.42 శాతం పోలింగ్ నమోదయింది. ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పూనమ్ మాదమ్ ఆయన మేనకోడలే కావడం గమనార్హం. తాను ఓటమిపాలు కావడం ఖాయమని... అందువల్ల తాను గెలుస్తానని ఎవరూ బెట్టింగులు కాయకండని సూచించారు.