: ఎస్పీకి ఓటేయకుంటే నిజమైన ముస్లింలు కారు: అజ్మి వ్యాఖ్యలు
మహారాష్ట్రకు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత అబూ అజ్మి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అభ్యర్థి బల్ చంద్ర యాదవ్ కు మద్దతుగా ఖలీలాబాద్ లో జరిగిన ర్యాలీలో అజ్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్పీకి ఓటేయని ముస్లింలు అసలు నిజమైన ముస్లింలు కానే కారని ఆయన వ్యాఖ్యానించారు. అలా ఓటేయని వారికి డీఎన్ ఏ పరీక్ష నిర్వహించి, వారు ఆర్ఎస్ఎస్ కు చెందిన వారేమో చూడాలని ఆయన అనడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. తర్వాత తన వ్యాఖ్యలపై అజ్మి మాట్లాడుతూ... ముస్లింలు మరింత లౌకికవాదులని, హిందువులను తమ నేతలుగా ఆమోదించారని చెప్పారు. బీజేపీ నినాదం హిందూ, హిందూ భాయీ భాయీ విద్వేషానికి కారణమవుతుందన్నారు.