: ఫేక్ కాల్స్ తో చెన్నైలో భయాందోళనలు


ఫేక్ ఫోన్ కాల్స్ తో చెన్నై వణికిపోతోంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం మీద బాంబు పేలి ఓ యువతి మరణించడంతో ఆ నగరాన్ని బాంబుల భయం చుట్టుముట్టింది. ఫేక్ ఫోన్ కాల్స్ తో ఈ భయం మరింత పెరిగిపోయింది. తప్పుడు ఫోన్ కాల్స్ చేసినట్టు నిర్ధారణ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించినా ఫేక్ ఫోన్ కాల్స్ ఆగడంలేదు. తాజాగా చెన్నైలోని పెద్ద షాపింగ్ మాల్, ఓ విద్యాసంస్థ, శివారులోని రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతాధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వస్తువులు దొరకకపోవడంతో భద్రతాదళాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి.

  • Loading...

More Telugu News