: యువతిపై పెంపుడు తండ్రి, అతని మిత్రుల దాష్టీకం


అరాచకాల అడ్డా ఉత్తరప్రదేశ్ లో సభ్యసమాజం తలెత్తుకోలేని సంఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తు పెంపుడు తండ్రే దాష్టీకానికి తెరతీయడం అక్కడ జరుగుతున్న అరాచకాల తీవ్రతను చాటుతోంది. ఉత్తరప్రదేశ్ లోని సంబల్ ప్రాంతంలోని హయత్ నగర్ లో 27 ఏళ్ల యువతి ఫ్యాక్టరీలో పని పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరింది. మార్గ మధ్యంలో ఆమె సవతి తండ్రి చంద్రపాల్, అతని మిత్రులు రవిశర్మ, రాంబాబులు కలసి ఆ యువతిని అపహరించారు. అనంతరం సవతి తండ్రి, అతని మిత్రులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించిన వైద్యులు... ముగ్గురు కీచకులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News