: పరిటాల శ్రీరామ్ కు 15 రోజుల రిమాండ్
పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది. అంటే పదిహేను రోజుల పాటు శ్రీరామ్ రిమాండ్ లో ఉంటారు. రెండు రోజుల కిందట ఎర్రకుంట్లలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కేసు నమోదవడంతో శ్రీరామే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు.