: సింగపూర్ లో భారతీయులకు ఇళ్లివ్వడం లేదు


సింగపూర్ లో భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడ ఇళ్లు కలిగిన వారు భారతీయులకు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అలాగే, చైనీయలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. భారతీయులు ఇల్లు అద్దెకు కావాలంటూ వెళితే, సారీ అంటూ మొహం మీద డోర్ వేసేస్తున్నారు. ఈ మేరకు బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. నిజానికి సింగపూర్ లో జాతి వివక్ష నేరం. పైగా, ఈ దేశం వలసవాదులతో నిర్మితమైనది. 74 శాతం చైనీయులు, 13 శాతం మలయ, 9శాతం భారతీయులు, 4 శాతం ఇతరులు ఇక్కడ ఉన్నారు. భారతీయులకు ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదన్న దానికి స్థానిక ఇంటి యజమానులు ప్రధానంగా చెప్పే కారణాలు... భారతీయులు అధిక నూనె, మసాలా ఘాటుతో వంటలు చేసుకుంటారు. ఇరుగు పొరుగు వారికి దానివల్ల ఇబ్బంది. ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరు. స్నేహితులను, తెలిసిన వారిని ఇళ్లల్లో ఉండనిస్తారు.

  • Loading...

More Telugu News