: బొత్స ఇలాకాలో బాబు


మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొత్స సత్యనారాయణ అవినీతికి చిరునామా అన్నారు. అవినీతి ఎక్కడుంటే బొత్స అక్కడ ఉంటారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఓ సైకో అని, ఆ పార్టీ సైకో పార్టీ అని ఆయన మండిపడ్డారు. జగన్ ను కానీ, ఆ పార్టీని కానీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ అధికారం చేపడితే రాష్ట్రాన్ని దోచుకుంటాడని బాబు తెలిపారు.

తాను ఢిల్లీకి వెళ్తే మంత్రి పదవి ఖాయమని, అయినా తాను ఢిల్లీకి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడినా వదిలి పెట్టనని బాబు తెలిపారు. బొత్స మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప కూడా దాటవని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ లు గాఢమైన ప్రేమికులని చంద్రబాబు అన్నారు. సోనియా అండతో బొత్స పాల్పడిన అవినీతికి అంతం లేదని ఆయన వెల్లడించారు. తాను నీతిగా, నిప్పులా బతికానని బాబు తెలిపారు. తనకు అవినీతి ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే ఆ ఆస్తి వారికే రాసిచ్చేస్తానని బాబు సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News