: హిందూపురంలో గృహ ప్రవేశం చేసిన బాలకృష్ణ
టీడీపీ శాసనసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తను పోటీ చేస్తున్న హిందూపురంలో ఓ అద్దె ఇంటిలో ఈ ఉదయం గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి పూజలు నిర్వహించారు. హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య స్థానికేతరుడంటూ విపక్షాలు విమర్శలు చేయడంతో ఈ మేరకు ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. త్వరలోనే హిందూపురంలో సొంత ఇల్లు తీసుకోనున్నట్లు బాలయ్య తెలిపారు.