: 84 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం... ఆస్పత్రిలో మృతి


కామంతో కళ్లు మూసుకుపోయిన ఉన్మాదులు వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఈ రోజు కన్నుమూసింది. కేరళలోని, కొల్లాం జిల్లా చవారాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని ఇరుగు, పొరుగు వారు నిన్న గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమెను తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందిందని, పోస్ట్ మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News