: సొమ్మసిల్లిన రోజా
వైఎస్సార్సీపీ నగరి అభ్యర్థి, సినీ నటి రోజాకు వడదెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రచారం చేస్తుండడంతో ఎకాంబరకుప్పంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.