: నేను మోడీ అభిమానిని: ప్రీతిజింటా
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి బాలీవుడ్ నటి ప్రీతిజింటా మద్దతు తెలిపింది. తాను మోడీ అభిమానినని, ఆయన విజయాన్ని కోరుకుంటున్నట్లు చెెప్పింది. ఈ ఉదయం వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న ప్రీతి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొంది. తాను దేవుని దర్శనానికి వచ్చానని, మోడీ గెలుపుకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నది. ప్రజలు మోడీని అభిమానిస్తున్నారని, ముఖ్యంగా మహిళలు, పేదలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించింది.