: మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు శంకరాచార్యుల ప్రచారం


బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి వ్యతిరేకంగా వారణాసి లోక్ సభ స్థానంలో ప్రచారం చేయడానికి ఇద్దరు శంకరాచార్యులు నడుం బిగించారు. పూరీ శంకరాచార్య స్వామి అధోక్షజానంద దేవ్ తీర్థ్ స్వయంగా రంగంలోకి దిగుతుండగా, ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద తన శిష్యుడు స్వామి అవి ముక్తేశ్వరానందను వారణాసికి పంపించనున్నారు.

2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ పాపాత్ముడని స్వామి అధోక్షజానంద అన్నారు. తాను వారణాసికి వెళ్లి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. అధికారం కోసం మోడీ ప్రజలను విభజిస్తున్నారని చెప్పారు. మతం పేరుతో ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇక హర్ హర్ మోడీ నినాదంపై స్వామి స్వరూపానంద ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News