: తప్పుడు కేసులతో నన్ను జైలుకు పంపారు: జగన్
తాను ఏ తప్పు చేయలేదని... తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపారని వైఎస్సార్సీపీ నేత జగన్ అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో నేడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సీఎం కాగానే సీమాంధ్ర దశ, దిశ మారుస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని... ఆయనకు విశ్వసనీయత లేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఉండరని, టీడీపీ కూడా ఉండదని చెప్పారు.