: మద్యం పంపిణీ చేస్తున్న వైకాపా నేత అరెస్ట్
సీమాంధ్రలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో, ఓటర్లను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో ఎక్సైజ్ అధికారులు మద్యం పంపిణీని అడ్డుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్సీపీ నేత గోపాలయ్యను అరెస్ట్ చేశారు. 14 కేసుల చీప్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో వైకాపా నేత అంజిరెడ్డి ఇంటికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు.