: షారూఖ్ ఖాన్ కు 'వంద కోట్ల' కష్టం..!


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్టుంది. 2007 నాటి బ్లాక్ బస్టర్ 'ఓం శాంతి ఓం'లో షారూఖ్ అలనాటి నటుడు మనోజ్ కుమార్ ను అనుకరిస్తూ చిత్రీకరించిన పేరడీ సన్నివేశాల్ని ఇప్పటికీ తొలగించని కారణంగా పరువు నష్టం దావా ఎదుర్కొనాల్సిన ప్రమాదంలో పడ్డాడు. ఆ సన్నివేశాలు తొలగించిన తర్వాతే ఆ సినిమాను జపాన్ లో విడుదల చేయాలని అప్పట్లో షారూఖ్ కు పలుమార్లు సూచించినా పెడచెవినపెట్టాడని మనోజ్ కుమార్ వాపోయారు.

ఇప్పటికి షారూఖ్ ను రెండుసార్లు క్షమించానని, మరోసారి అతన్ని వదిలిపెట్టనని మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. షారూఖ్ తో పాటు వీడియో సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పైనా, రూ. 100 కోట్ల మేర పరువు నష్టం కోరుతూ సివిల్, క్రిమినల్ కేసులు వేయబోతున్నట్టు ఆయన చెప్పారు. కాగా, చిత్ర ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి పేరడీ సీన్లు తొలగించాలని 2008లోనే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, షారూఖ్ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడ్డట్టయిందని మనోజ్ కుమార్ తెలిపారు. 

  • Loading...

More Telugu News