: బాసర పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు


ఆదిలాబాద్ జిల్లా బాసరలో వెలసిన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ఈ రోజు భక్తులు పోటెత్తారు. ఈ రోజు పవిత్రమైన అక్షయ తృతీయ కావడంతో, తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి చదువులు వస్తాయని భక్తులు భావిస్తుంటారు. దీంతో తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం వేకువ జామునుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

  • Loading...

More Telugu News