: సునీల్ శెట్టిపై కేసు నమోదు


నిర్మాత హేమేంద్ర సింగ్ ను మోసం చేశారనే ఆరోపణలతో నటుడు సునీల్ శెట్టిపై రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 'ముంబై కిస్ కీ' చిత్రంలో నటించేందుకు గతేడాది సునీల్ శెట్టితో ఒప్పందం చేసుకున్నానని, అడ్వాన్స్ గా 21 లక్షలు తీసుకున్న తర్వాత అందుబాటులో లేకుండా పోయాడని నిర్మాత హేమేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి తాను నటించనని తేల్చి చెప్పడంతో పాటు, తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని కూడా తిరిగివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సునీల్ శెట్టిపై పోలీసులు సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేశారు. సునీల్ శెట్టిపై దాఖలైన పరువునష్టం దావాను రెండు రోజుల క్రితమే ఢిల్లీ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అంతలోనే ఆయనపై మరో కేసు దాఖలవడం గమనార్హం.

  • Loading...

More Telugu News