: వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన వసంత నాగేశ్వరరావు
మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ అరెస్ట్ ఉదంతం వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కుట్రలను బహిర్గతం చేస్తానని అన్నారు. కృష్ణ ప్రసాద్ అరెస్టుకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.