: అసోంలో విరుచుకుపడ్డ తీవ్రవాదులు... ఏడుగురి మృతి


అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు సహా ఏడుగురు చనిపోయారు. ఓ గుంపుగా ఉన్న సాయుధ తీవ్రవాదులు గోరేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలపరాజన్ గ్రామంలోని రెండిళ్లపై కాల్పులు జరిపినట్లు ఓ అధికారి తెలిపారు. మరో ఇద్దరికి గాయాలవగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News