: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు ఈరోజు సీమాంధ్రలో విడివిడిగా ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ రోజు ప్రచారం చేస్తారు. ఇక పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచార పర్యటన చేబడుతున్నారు. ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 11 గంటలకు తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఒంటి గంటకు రాజమండ్రి, 3 గంటలకు కాకినాడ సభల్లో మాట్లాడతారు. నిన్న రాత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ విశాఖలోనే బస చేశారు.