: నేడు గుంటూరులో సోనియా సభ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందాక ఆమె సీమాంధ్ర ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆమె హెలికాప్టర్ లో గుంటూరు బయలుదేరి వెళ్తారు.