: సీమాంధ్రను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు


నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలో తల్లీ కొడుకులను, సీమాంధ్రలో అమ్మా కొడుకులను ఓడించాలని ప్రజలను పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయిందన్నారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీని ఓడించాలని, విశాఖ జిల్లాలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ, తాను కలిసి సీమాంధ్రను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తామని చంద్రబాబు చెప్పారు. నరేంద్ర మోడీ కంటే ముందు చంద్రబాబు ప్రసంగించాల్సిఉండగా, భారీ వర్షం మొదలవడంతో మోడీ ప్రసంగం అనంతరం తను మాట్లాడతానని చెప్పి చివరలో ఆయన ప్రసంగించి సభను ముగించారు.

  • Loading...

More Telugu News