: చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ విశాఖలోని బహిరంగసభలో మాట్లాడుతూ... దేశమంతా ఇప్పుడు మోడీ గాలి వీస్తోందని అన్నారు. విశాఖలో జనసేన తొలి బహిరంగ సభ పెట్టినప్పుడు విశాఖపట్నం వాసుల మద్దతును తాను మరచిపోలేనని పవన్ కల్యాణ్ అన్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సహా అందరినీ గౌరవించానని, అయితే ఆ గౌరవాన్ని వారు నిలబెట్టుకోలేదన్నారు. తనను తిడితే భరించానని, కానీ దేశానికి ప్రధాని అయ్యే నరేంద్ర మోడీని కూడా కేసీఆర్ నిందించినప్పుడు కేసీఆర్ ను తాను తాట తీస్తానని హెచ్చరించానన్నారు. తాను ఎవరికీ భయపడనని, తాను అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. సీమాంద్రలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్న హరిబాబును గెలిపించాలని ఆయన కోరారు.