: వానమామలై మఠాధిపతి శ్రీ కల్యాణ రామానుజ జీయర్ కన్నుమూత
తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న వానమామలై మఠాధిపతి శ్రీ కల్యాణ రామానుజ జీయర్ ఇవాళ (గురువారం) ఉదయం నిర్యాణం చెందారు. 84 సంవత్సరాల జీయర్ తెల్లవారుజామున 4 గంటలకు ‘ముక్తి’ని పొందారని వానమామలై మఠాధికారులు తెలిపారు. వృద్ధాప్యం వల్ల కలిగే అనారోగ్యంతో తిరునల్వేలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జీయర్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక్కడకు సమీపంలోని నంగునేరిలో ఉన్న ‘తిరువరసు’ (సన్యాసులకు ప్రత్యేక ఖనన ప్రదేశం)లో జీయర్ పార్థివదేహాన్ని సమాధి చేయనున్నట్లు వానమామలై మఠం అధికారులు తెలిపారు.