: తివారీకి తోడుగా ఉండాలనుకుంటున్నా... ఆయన ఆస్తి అక్కర్లేదు: ఉజ్జ్వలా శర్మ


మాజీ గవర్నర్ నారాయణ దత్ తివారీకి తాను తోడుగా ఉండాలనుకుంటున్నానని, ఆయన ఆస్తి తనకు అవసరం లేదని ఉజ్జ్వలా శర్మ తెలిపారు. పితృత్వ కేసులో కోర్టుల చుట్టూ తిరిగి, డీఎన్ఏ పరీక్షల అనంతరం ఉజ్జ్వలా శర్మ తనయుడు రోహిత్ వర్మను తివారీ కొడుకుగా అంగీకరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తివారీ ఇంటికి వెళ్లిన తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని, తాను ఫోన్ చేస్తే ఆ విషయం తివారీకి తెలియకుండా సెక్యూరిటీ అధికారి భవానీ భట్ దాచిపెడుతున్నారని ఉజ్జ్వలా శర్మ ఆరోపించారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉజ్జ్వలా శర్మ ఫిర్యాదు మేరకు భవానీ భట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News