: బ్లాక్ మనీ కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు
నల్లధనం కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఏర్పాటు చేసింది. దానికి హెడ్ గా వ్యవహరించాలంటూ మాజీ జడ్జి జస్టిస్ ఎంబీ షాను ఈ రోజు కోర్టు కోరింది. అంతేకాక, సిట్ కు వైఎస్ ఛైర్మన్ గా ఉండాలని మరో మాజీ జడ్జి అరిజిత్ పసాయత్ ను కూడా న్యాయస్థానం కోరింది. దానికోసం మూడు వారాల్లోగా ఓ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విదేశాల్లో నల్లధనం ఖాతాదారులపై చర్యలకు ఉపక్రమించిన కేంద్ర సర్కార్ రెండు రోజుల కిందట ఇరవై ఆరు పేర్లను సీల్డ్ కవర్ లో సుప్రీంకు అందించింది. అందులో ఎనిమిది మంది గురించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది.