: శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జిల్లాలోని పాలకొండ, ఇచ్ఛాపురం, పాతపట్నం, ఆముదాల వలసలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో ప్రచారాన్ని పూర్తిచేసి రేపు రాత్రికి చంద్రబాబు విశాఖ చేరుకొంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.