: ప్రధాని అయ్యే అసలైన యోగ్యత మోడీకే ఉంది: కావూరి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ఎన్డీఏ సభలో మోడీ సమక్షంలో కావూరి సాంబశివరావు బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయనను గజమాలతో కావూరి సత్కరించగా, పార్టీ జెండా మెడలో వేసి కావూరిని పార్టీలోకి మోడీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ, ఈ దేశాన్ని పాలించే అర్హత రాజులు, రాణులు, గాంధీ కుటుంబానికి మాత్రమే కాక, సామాన్య పౌరులకు కూడా ఉందన్నారు. అది తెలియజేసేందుకే మోడీ ప్రస్థానమని పేర్కొన్నారు. కష్టపడి పైకి వచ్చిన ఆయన ప్రధాని కాబోతున్నారని, ఆ పదవికి అసలైన యోగ్యుడు ఆయనేనని తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో పని చేసేందుకే బీజేపీలో చేరుతున్నానని కావూరి చెప్పారు.