: తల్లీకొడుకుల పాలన పోవాలి... బీజేపీ ప్రభుత్వం రావాలి: నరేంద్ర మోడీ


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఎన్డీయే భారత్ విజయ్ బహిరంగ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండు విషయాలు స్పష్టమయ్యాయని మోడీ చెప్పారు. తల్లీ కొడుకుల పాలనలో ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ఇక రెండో విషయం... ఎన్డీయే ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమయ్యిందని మోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పునాది ఏర్పడిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో, సీమాంధ్రలో శక్తిమంతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడమే మిగిలిందని ఆయన అన్నారు. ఈ నెల 7న జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఓటు వేసి సీమాంధ్రకు మంచి భవిష్యత్తునిచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.

భీమవరం దేశవిదేశాల్లో ఎంతో ఖ్యాతి గడించిందని మోడీ చెప్పారు. ఇక్కడ ఆక్వా కల్చర్ ఎంతో అభివృద్ధి చెందిందని, దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. మత్స్య పరిశ్రమ, రొయ్యల పెంపకానికి కొత్త సాగు పద్థతులను నేర్పుతామని ఆయన అన్నారు. ఆర్నమెంటర్ ఫిష్ పెంపకం చేపడితే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. ఆ దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఆయన హామీనిచ్చారు.

  • Loading...

More Telugu News