: కులం, మతం కాదు... గుణాన్ని చూసి ఓటేయండి: వెంకయ్య నాయుడు
2014 ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. మనకు బంగారు భవిష్యత్తు కావాలంటే నరేంద్రమోడీ ప్రధాని కావాలని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గుంటూరులో జరిగిన ఎన్డీయే విజయశంఖారావంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు.
నరేంద్ర మోడీ, చంద్రబాబు జోడీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో కులమతాలు కాకుండా గుణం చూసి ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మందు, విందు, సొమ్మును చూసి కాకుండా... నీతి, నిజాయతీ, సిద్ధాంతానికి, ఆదర్శానికి కట్టుబడి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని వెంకయ్య కోరారు.